గుజరాత్: రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రహదారులపై నీరు నిలిచింది.
కొన్ని ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను తాత్కాలికంగా మూసివేశారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సౌరాష్ట్ర ప్రాంతంలోని సురేంద్రనగర్, రాజ్‌కోట్, మోర్బీ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తీవ్ర వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, స్థానిక అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటించాలని సూచించారు.
నదులు, వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.