మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
AP TODAY
AP TODAY

9 hours ago

AP:రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు అందింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, అసిస్టెంట్‌ కమిషనర్‌, డీఈఓ, ఆర్టీవో, మున్సిపల్‌ కమిషనర్‌ తదితర కీలక పోస్టులు ఉన్నాయి.

గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 2026 అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభమై.. అక్టోబర్‌ 27 వరకు కొనసాగనుంది. అర్హత, వయసు, ఫీజు తదితర నిబంధనలను నోటిఫికేషన్‌లో అభ్యర్థులు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ద్వారా భర్తీ చేసే సర్వీసులు ఇవే..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ శాఖల్లోని కీలక సర్వీసుల పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • డిప్యూటీ కలెక్టర్‌: 11 పోస్టులు

  • ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌: 14 పోస్టులు

  • డీఎస్పీ (సివిల్‌): 36 పోస్టులు

  • డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌): 3 పోస్టులు

  • డీఈఓ: 14 పోస్టులు

  • ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: 1 పోస్టు

  • ఆర్టీవో: 3 పోస్టులు

  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ (కోఆపరేటివ్‌ సర్వీసెస్‌): 15 పోస్టులు

  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2: 12 పోస్టులు

  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌: 2 పోస్టులు

  • డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌: 3 పోస్టులు

  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌: 14 పోస్టులు

  • డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌: 35 పోస్టులు

దరఖాస్తు ఎలా చేయాలి?

గ్రూప్‌-1 ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, పరీక్ష విధానం, ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

APPSC Group-1 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం:
APPSC అధికారిక పోర్టల్‌

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 6 అక్టోబర్‌ 2026

  • దరఖాస్తుల చివరి తేదీ: 27 అక్టోబర్‌ 2026

  • మొత్తం ఖాళీలు: 163

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement