బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ధర్మవరం బిఎస్ఎన్ఎల్ (BSNL) కార్యాలయంలో ఆధార్ కేంద్రం
ధర్మవరం బిఎస్ఎన్ఎల్ (BSNL) కార్యాలయంలో ఆధార్ కేంద్రం
AP TODAY
AP TODAY

September 8, 2026

శ్రీ సత్య సాయి జిల్లా, APTODAY: ధర్మవరం పట్టణ ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేస్తూ కొత్తపేటలోని స్థానిక బిఎస్ఎన్ఎల్ (BSNL) కార్యాలయంలో నూతనంగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన ఆధార్ కేంద్రాన్ని బిఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్ (DE) నెనావత్, సబ్ డివిజనల్ ఇంజనీర్ (SDE) ఉదయ్ కుమార్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, స్థానిక ప్రజలు ఆధార్ సేవల కోసం దూరప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేందుకు ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో నూతన ఆధార్ కార్డుల నమోదు, ఆధార్ కార్డులో చిరునామా మార్పు/సవరణ, ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ అనుసంధానం, బయోమెట్రిక్ అప్‌డేట్, వేలిముద్రలు, ఐరిస్, ఫోటో గుర్తింపు వంటి సేవలు ఉంటాయన్నారు. ఆధార్ కేంద్రం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు ప్రజలకు సేవలను అందిస్తుందన్నారు. కావున ధర్మవరం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆధార్ కార్డులలో ఎలాంటి సవరణలు లేదా కొత్త నమోదులు ఉన్నా, దానికి సంబంధించిన ఒరిజినల్ గుర్తింపు మరియు చిరునామా పత్రాలతో నేరుగా కొత్తపేటలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి విచ్చేసి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement