బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై HDS సమావేశం
కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై HDS సమావేశం
AP TODAY
AP TODAY

September 5, 2026

కదిరి, సెప్టెంబర్ 5 (APTODAY): కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ (HDS) సమావేశాన్ని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా కాంట్రాక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, రోగులకు సమయానికి వైద్య సేవలు అందిస్తూ మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులు, మరుగుదొడ్లలో పారిశుధ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు భోజన సౌకర్యం కల్పించే అంశంపైనా సమావేశంలో చర్చించారు. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదానం ద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు భోజనం అందించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ అంశంపై తదుపరి HDS సమావేశానికి ఆలయ ఈవోను ఆహ్వానించి, అన్నదానం నిర్వహణ విధానం, అవసరమైన ఏర్పాట్లు, అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అవసరమైన చర్యలు చేపడతామని కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. సమావేశంలో APHM IDC ఎస్‌ఈ ఐ. ఇంద్ర, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, HDS సభ్యులు రెడ్డిభాష, కేశవ్ రెడ్డి, వేణు రెడ్డి, కుటాల లక్ష్మణ్, వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement