మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / సంపత్ వినాయక ఆలయంలో వినాయకచవితి నవరాత్రులు
సంపత్ వినాయక ఆలయంలో వినాయకచవితి నవరాత్రులు
AP TODAY
AP TODAY

4 days ago

విశాఖ: సంపత్ వినాయక ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

 

14న తెల్లవారుజామున 3 గంటలకు హోమంతో ప్రారంభం.. 23న మహా అన్నదానం

 

విశాఖపట్నం: నగరంలోని ప్రముఖ సంపత్ వినాయక ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

 

ఉత్సవాల్లో భాగంగా 14వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు హోమం నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రసాదరావు తెలిపారు. అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణ, స్వర్ణాలంకరణ నిర్వహిస్తామని చెప్పారు.

 

ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

 

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఉత్సవాల ముగింపు సందర్భంగా 23వ తేదీన మహా అన్నదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

 

వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement