బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / విశాఖలో వర్ష బీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
విశాఖలో వర్ష బీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
AP TODAY
AP TODAY

3 days ago

విశాఖపట్నం: విశాఖ నగరంలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలీపురం, నాయుడుతోట ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. వర్షపు నీటితో కలిసి మురుగునీరు నిలిచిపోవడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, రాకపోకలు సాగించాలన్నా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

వర్షపు నీటిని, మురుగునీటిని వెంటనే తొలగించి రోడ్లను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement