బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / కదిరిలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
కదిరిలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
AP TODAY
AP TODAY

5 days ago

కదిరిలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

రజకుల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకున్న నాయకులు

కదిరి, సెప్టెంబర్ 10 (AP Today): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎల్లప్ప దోబీ ఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, రజక సంఘం సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ.. రజకుల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక అన్యాయాలను ఎదురించి ధైర్యంగా పోరాడిన ఐలమ్మ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

రజకుల హక్కులు, సంక్షేమం కోసం రజకులంతా ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

రజక సంఘం కార్యక్రమాలను విజయవంతం చేయాలి

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో రజకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సంఘం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రజకుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర రజక సంఘం సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షుడు కనుముక్కల లక్ష్మన్న, జిల్లా అధ్యక్షుడు బాపనపల్లి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు తలుపుల గంగన్న, ఆర్టీసీ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబెల్లె శివశంకర్, కదిరి పట్టణ అధ్యక్షుడు పులగంపల్లి శివప్ప, ప్రధాన కార్యదర్శి లింగమయ్య, అంజలి, రజక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement