బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / వినాయక చవితి వేళ విషాదం.. పాదగయ పుష్కరిణిలో యువకుడు మృతి
వినాయక చవితి వేళ విషాదం.. పాదగయ పుష్కరిణిలో యువకుడు మృతి
AP TODAY
AP TODAY

1 day ago

కాకినాడ: వినాయక చవితి పర్వదినాన కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సోమవారం ఉదయం పాదగయ క్షేత్రానికి దర్శనం కోసం వెళ్లారు.

దర్శనానికి ముందు పాదగయలోని పుష్కరిణిలో స్నానం చేసేందుకు ముగ్గురూ నీటిలోకి దిగారు. ఈ సమయంలో సాయి అనే 22 ఏళ్ల యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. స్నానం చేస్తుండగా జారి నీటిలో మునిగిపోయినట్లు సమాచారం.

యువకుడు గల్లంతైన విషయం తెలుసుకున్న స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వినాయక చవితి సందర్భంగా పాదగయకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదాన్ని నింపింది.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.

పుష్కరిణులు, చెరువులు, నదులు, సముద్ర ప్రాంతాల్లో పండుగల సమయంలో భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకపోవడం, చిన్నపిల్లలను ఒంటరిగా నీటిలోకి వెళ్లనివ్వకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement