బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / మోదీ-పుతిన్ స్నేహంపై కీలక వ్యాఖ్యలు.. భారత్-రష్యా బంధం మరింత బలోపేతం!
మోదీ-పుతిన్ స్నేహంపై కీలక వ్యాఖ్యలు.. భారత్-రష్యా బంధం మరింత బలోపేతం!
AP TODAY
AP TODAY

September 1, 2026

భారత్-రష్యా మధ్య విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం నిరంతరం బలపడుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత చొరవతో పాటు.. ఇరు దేశాల నేతల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

బిష్కెక్ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో పుతిన్ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్-రష్యా సంబంధాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతిపై పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యా మధ్య కేవలం వాణిజ్య సంబంధాలే కాకుండా.. దృఢమైన వ్యక్తిగత స్నేహబంధం కూడా ఉందని తెలిపారు.

గ్లోబల్ సౌత్, తూర్పు దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఎస్‌సీఓ కీలక వేదికగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. సదస్సుకు ముందుగా మోదీతో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు.

ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో పర్యటన సందర్భంగా ప్రస్తావించిన అంశాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు.

ఇక ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం ఆశాజనకంగా ఉందని పుతిన్ తెలిపారు. గతేడాది స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ.. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత్-రష్యా వాణిజ్య టర్నోవర్ 2.6 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు.

విద్యా రంగంలోనూ ఇరు దేశాల సహకారం అద్భుతంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. గత దశాబ్దంలో రష్యాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడు రెట్లు పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రష్యాలో సుమారు 40 వేల మంది భారతీయ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని వెల్లడించారు.

మరోవైపు సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం రష్యా సిద్ధమవుతోందని పుతిన్ తెలిపారు.

అంతేకాదు.. 2027 నాటికి భారత్-రష్యా దౌత్య సంబంధాలు 80 ఏళ్లు పూర్తి చేసుకోనున్న విషయాన్ని కూడా పుతిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మొత్తంగా మోదీ-పుతిన్ భేటీతో భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక, వాణిజ్య, విద్యా రంగాల్లో సహకారంపై మరోసారి స్పష్టమైన సందేశం వెలువడింది.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement