మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / నెట్‌ఫ్లిక్స్ వైపు వెళ్లకుంటే కోట్లు.. క్రియేటర్లకు యూట్యూబ్ భారీ నజరానా!
నెట్‌ఫ్లిక్స్ వైపు వెళ్లకుంటే కోట్లు.. క్రియేటర్లకు యూట్యూబ్ భారీ నజరానా!
AP TODAY
AP TODAY

August 20, 2026

ప్రముఖ కంటెంట్ క్రియేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్టార్ యూట్యూబర్లను తమ ప్లాట్‌ఫామ్‌కే పరిమితం చేసేందుకు, వారికి మిలియన్ల డాలర్ల విలువైన ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడానికి యూట్యూబ్ సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ ఒక కథనంలో, సంబంధిత చర్చల గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ ఆసక్తికర సంగతులు వెల్లడించింది.

ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లను దక్కించుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో, యూట్యూబ్ ఈ ఎదురుదాడికి దిగింది. తమ వీడియోలను కొంతకాలం పాటు యూట్యూబ్‌లో మాత్రమే ప్రత్యేకంగా విడుదల చేసే క్రియేటర్లకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కార్యక్రమాల నిర్మాణానికి నేరుగా నిధులు సమకూర్చడం లేదా పెద్ద బ్రాండ్ డీల్స్‌లో వాటా ఇవ్వడం వంటివి ఉన్నాయి. ఇప్పటికే పలువురు భాగస్వాములతో యూట్యూబ్ ఒప్పందాలకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం.

ఒకేసారి యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోలను విడుదల చేసే క్రియేటర్లపై పరోక్షంగా ఒత్తిడి పెంచేందుకు కూడా యూట్యూబ్ సిద్ధమవుతోంది. అలాంటి వారికి మార్కెటింగ్ క్యాంపెయిన్లలో ప్రాధాన్యం తగ్గించడం, ప్రత్యేక ఈవెంట్లకు ఆహ్వానించకపోవడం, బ్రాండ్ డీల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో వాటాను తగ్గించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement