మోదీతో పుతిన్, పేజెష్కియన్.. వైరల్‌గా మారిన దృశ్యం!
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఢిల్లీలో జరిగిన BRICS సమావేశంలో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్‌లతో కలిసి చేతులు పట్టుకుని నడిచారు.
అమెరికాతో తీవ్ర విభేదాలు ఉన్న రష్యా, ఇరాన్ నేతలతో మోదీ ఇలా స్నేహపూర్వకంగా కనిపించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుద్ధాల మధ్య భారత్ మాత్రం అన్ని కీలక దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ.. “దౌత్యమే పరిష్కారం.. జాతీయ ప్రయోజనాలే భారత్‌కు ప్రధానం” అనే సందేశాన్ని ఇస్తున్నట్లు ఈ దృశ్యం కనిపించింది.
మోదీ-పుతిన్, మోదీ-పేజెష్కియన్‌ల మధ్య జరిగిన చర్చల్లో ప్రాంతీయ పరిస్థితులు, వాణిజ్యం, సముద్ర మార్గాల భద్రత, శాంతి-స్థిరత్వం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.