గురువారం, 17 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఏలూరులో ట్రామాడాల్ కలకలం.. 880 ఇంజెక్షన్లు స్వాధీనం, ఐదుగురు అరెస్ట్
సామాన్యుడిపై ధరల భారం పడొద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు
టాలీవుడ్‌కు గుడ్‌న్యూస్.. CBFC సభ్యురాలిగా సుప్రియ యార్లగడ్డ
వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
కళ్యాణదుర్గంలో చిట్టీ వ్యాపారంపై ఆరోపణలు.. రూ.3 కోట్ల మోసం అంటూ బాధితుల ఫిర్యాదు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. తిరుమలలో ఆధునిక సౌకర్యాలకు శ్రీకారం
నరసాపురంలో మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో నలుగురి పేర్లు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2,050 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
యూరప్‌లో కీలక ప్రకటనలు.. AI నుంచి భద్రత వరకు కొత్త ప్రతిపాదనలు
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
భారత్–వియత్నాం బంధం మరింత బలోపేతం.. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తికి అడుగులు
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలపై ఆరోపణలు.. విద్యుత్ వైర్లకు తగిలి లారీ దగ్ధం
AP TODAY / వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
AP TODAY
AP TODAY

2 hours ago

 

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ శివారులోని నేరేడు చెరువులో వినాయక నిమజ్జనం సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం వెళ్లిన **శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు.**

ప్రమాదంపై సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులను **నర్సింహ రాజు, సుమంత్, గణేశ్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్, సిద్ధార్థ్**గా గుర్తించారు. వీరిలో పలువురు డిప్లొమా విద్యార్థులు కాగా, సిద్ధార్థ్ 10వ తరగతి చదువుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఘటన విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనాథాశ్రమ నిర్వాహకులను పరామర్శించి తన సానుభూతిని తెలిపారు.

రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

పెద్దకంజర్లలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement