టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధి సుప్రియ యార్లగడ్డకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర సెన్సార్ బోర్డు (CBFC) సభ్యురాలిగా ఆమె నియమితులయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 16న 18 మంది సభ్యులతో కూడిన కొత్త CBFC జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి సుప్రియ యార్లగడ్డకు చోటు దక్కింది. కొత్తగా నియమితులైన సభ్యుల పదవీకాలం మూడేళ్ల పాటు కొనసాగనుంది. సుప్రియతో పాటు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రియదర్శన్, పల్లవి జోషి తదితర సినీ ప్రముఖులకు కూడా CBFCలో అవకాశం లభించింది. అయితే వివిధ సినీ పరిశ్రమలకు ప్రాతినిధ్యం విషయంలో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.