విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) 43వ వార్డులో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా 43వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి కందుల నళిని దేవి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ కందుల నాగరాజు , జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వ స్ఫూర్తితో ప్రజాసేవే లక్ష్యంగా కందుల నళిని దేవి ముందుకు సాగుతున్నారు.
43వ వార్డు ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
43వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి కందుల నళిని దేవి