మధురవాడ: జీవీఎంసీ 9వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డులో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ, ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని నాగోతి రూపా కుమారి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాగోతి రూపా కుమారి మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ హయాంలో మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల తరహాలోనే తాను కూడా 9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని నాగోతి రూపా కుమారి స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మూడు సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేశానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతో పాటు వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను కూడా సాధించగలిగానని పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ, వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాగోతి రూపా కుమారి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. 9వ వార్డును మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆమెకు ప్రజలు సహకరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు పిల్లా వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు టేకు బుడి నర్సింగరావు, నాగోతి సత్యనారాయణ, బీజేపీ నాయకుడు జపాన్ శ్రీనివాస దేవరావు, జనసేన నాయకులు, టీడీపీ అధ్యక్షుడు కానూరి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.