శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / 6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
AP TODAY
AP TODAY

October 23, 2026

ఆరో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రతి సమస్యను పరిష్కరిస్తా

టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మన్యాల సురేష్ హామీ

మధురవాడ: జీవీఎంసీ ఆరో వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ మన్యాల మన్యాల తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మన్యాల సురేష్ మాట్లాడుతూఆరో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గతంలో ఇదే ప్రాంతం నాలుగో వార్డుగా ఉన్న సమయంలో తన తండ్రి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, అదే స్ఫూర్తితో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

కుమారుడి విజయానికి కృషి చేస్తా: మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు

మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన కుమారుడు సురేష్‌కు అవకాశం కల్పించినందుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరో వార్డులో తన కుమారుడిని గెలిపించి, గంటా శ్రీనివాసరావుకు విజయాన్ని కానుకగా అందిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

2007లో ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా పోరాడానో, అదే విధంగా భవిష్యత్తులోనూ ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తామరగడ్డ రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు, దుప్పాడ చెరువును కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే పేదలకు ఇళ్ల కల్పనతో పాటు వార్డులోని ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ఆరో వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు

ఈ కార్యక్రమంలో బొట్ట అప్పలరాజు, నాగోతి వెంకట్రావు, సాయిరాం కాలనీ చిరంజీవి వెంకట్రావుతో పాటు టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభ్యర్థికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement