శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / సుకుమార్‌–దేవిశ్రీ కాంబోకు బ్రేక్‌ పడనుందా?
సుకుమార్‌–దేవిశ్రీ కాంబోకు బ్రేక్‌ పడనుందా?
AP TODAY
AP TODAY

October 12, 2026

టాలీవుడ్‌లో దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కలయికలో వచ్చిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాల్లో సంగీతం, పాటలు సినిమాల విజయానికి కీలక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అనుబంధానికి ఇప్పుడు బ్రేక్‌ పడనుందనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

సుకుమార్‌–దేవిశ్రీ ప్రసాద్‌ ప్రయాణం 2004లో విడుదలైన ‘ఆర్య’ సినిమాతో ప్రారంభమైంది. అప్పటి నుంచి పలు విజయవంతమైన చిత్రాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. సుకుమార్‌ కథకు, ఆయన తెరకెక్కించే సన్నివేశాలకు దేవిశ్రీ అందించే సంగీతం ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

రామ్‌ చరణ్‌ సినిమా కోసం కొత్త సంగీత దర్శకుడు?

ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తెరకెక్కించనున్న కొత్త సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడి ఎంపికపై చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ స్థానంలో అనిరుధ్‌ రవిచందర్‌ను తీసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. మరోవైపు, గతంలో శాశ్వత్‌ సచ్‌దేవ్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు, అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘పుష్ప 2’ సమయంలో ఏం జరిగింది?

‘పుష్ప 2’ సినిమా నేపథ్య సంగీతం విషయంలో అదనపు సంగీత దర్శకుల సహకారం తీసుకోవడం, సినిమా విడుదలకు ముందు సంగీత పనులపై చర్చ జరగడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మధ్య సృజనాత్మక విభేదాలు వచ్చాయనే ప్రచారం మొదలైంది. అయితే, వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా? లేక కొత్త సినిమాకు కొత్త సంగీతాన్ని ప్రయత్నించాలనే ఉద్దేశంతోనే మరో సంగీత దర్శకుడిని పరిశీలిస్తున్నారా? అనే దానిపై స్పష్టత లేదు.

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకోవడంతో, వీరి తదుపరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడిగా ఎవరు ఎంపికవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement