తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. యనమల కుటుంబ సభ్యులతో, చికిత్స అందిస్తున్న వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యనమలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వైద్య ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, రాజకీయ అప్‌డేట్స్ కోసం AP TODAY ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.