శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / భీమిలిలో టీడీపీలోకి 300 మంది వైసీపీ కార్యకర్తలు | గంటా శ్రీనివాసరావు
భీమిలిలో టీడీపీలోకి 300 మంది వైసీపీ కార్యకర్తలు | గంటా శ్రీనివాసరావు
AP TODAY
AP TODAY

October 18, 2026

భీమిలి, అక్టోబర్ 18:

భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మండలంలోని మూలకుద్దు గ్రామానికి చెందిన సుమారు 300 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదివారం భీమిలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆనందపురం మండలంతో పాటు జీవీఎంసీ పరిధిలోని 1వ వార్డు తగరపువలస, 6వ వార్డు అమరావతి నగర్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఇంకా అనేకమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

164 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కూటమి చరిత్ర సృష్టించిందని గంటా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను నమోదు చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల కృషి కీలకమని పేర్కొన్నారు.

అలాగే, మాజీ సైనికోద్యోగుల కార్యాలయానికి స్థలం కేటాయించే అంశంలో కృషి చేస్తానని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి చిక్కాల విజయ్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు సరగడ అప్పారావు, మాజీ జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, పార్టీ మాజీ అధ్యక్షుడు డి.ఎ.ఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement