శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / అమరావతి: ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి
అమరావతి: ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి
AP TODAY
AP TODAY

October 14, 2026

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (AP SHRC) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ సభ్యులుగా న్యాయ విభాగం నుంచి పదవీ విరమణ చేసిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి నేరేళ్ల శ్రీనివాసరావు, నాన్‌ జ్యుడీషియల్ సభ్యుడిగా జేవీ మనోహర్‌రెడ్డిని నియమించినట్లు సమాచారం.

జస్టిస్ సత్యనారాయణమూర్తి నేపథ్యం

జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి 1960 జూన్ 14న మచిలీపట్నంలో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఏలూరులోని సీఆర్ రెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి, న్యాయవ్యవస్థలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2016 మార్చి 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి, 2022 జూన్‌లో పదవీ విరమణ చేశారు.

మానవ హక్కుల కమిషన్ బాధ్యతలు

ప్రజల మానవ హక్కులకు భంగం కలిగినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడం, హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టడం, బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు సిఫార్సులు చేయడం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన బాధ్యతల్లో భాగం. కొత్త చైర్మన్, సభ్యుల నియామకాలతో కమిషన్ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగుతాయని భావిస్తున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement