ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు.. కనకదుర్గమ్మకు పట్టువస్త్రాల సమర్పణ.విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 16న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య సీఎం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుమూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజున సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనానికి ప్రాధాన్యం ఇచ్చారు. రద్దీ నియంత్రణలో భాగంగా అంతరాలయ, వీఐపీ, ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు.