శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరిన 100 మందికి పైగా వైసీపీ నేతల
గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరిన 100 మందికి పైగా వైసీపీ నేతల
AP TODAY
AP TODAY

October 13, 2026

విశాఖపట్నం, అక్టోబర్ 12: విశాఖ నగరంలో రాజకీయ చేరికలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ 6వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంవీపీ కాలనీలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో భీమిలి నియోజకవర్గంలో టీడీపీలో చేరికలు పెరుగుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో 1వ వార్డు పరిధిలోని ప్రాంతాలతో పాటు ఆనందపురం మండలం శొంట్యాం గ్రామం నుంచి పలువురు టీడీపీలో చేరగా, తాజాగా కొమ్మాది, అమరావతి నగర్, ఎన్టీఆర్ కాలనీ, సాయిరాం కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి టీడీపీలో చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.

టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్ మన్యాల సోంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మాజీ వార్డు అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు, ముఖ్య నాయకులు కనకరాజు, సంజీవ్, మన్యాల హనుమంతు, గణేష్ తదితరులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మరికొందరు నేతలు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు: గంటా

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇంకా అనేకమంది నాయకులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చిక్కాల విజయ్ బాబు, 6వ వార్డు అధ్యక్షుడు గరే గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల నాయకుల చేరికలు విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే ఈ చేరికల ప్రభావం రానున్న ఎన్నికలపై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement