బుమ్రాకు గుడ్ న్యూస్.. ఫిట్‌గా ప్రకటించిన BCCI
న్యూఢిల్లీ: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నట్లు BCCI ధృవీకరించింది. దీంతో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆయన అందుబాటులో ఉండనున్నాడు.
మరోవైపు యువ పేసర్ హర్షిత్ రాణాకు మాత్రం మరోసారి గాయం సమస్య ఎదురైంది. ఫిట్‌నెస్ క్లియరెన్స్ పరీక్షల సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయం కావడంతో అతడిని అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌తో పాటు ఆసియా క్రీడల జట్టు నుంచి కూడా తప్పించారు.
హర్షిత్ రాణా స్థానంలో విదర్భ పేసర్ యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిలు కూడా ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందినట్లు సమాచారం.