శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / పవన్ కల్యాణ్ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నా..మేయర్ రేసులో కందుల నాగరాజు పేరు!
పవన్ కల్యాణ్ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నా..మేయర్ రేసులో కందుల నాగరాజు పేరు!
AP TODAY
AP TODAY

September 27, 2026

విశాఖపట్నం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విశాఖ నగర రాజకీయాల్లో మేయర్ పదవికి సంబంధించి పలు పేర్లు వినిపిస్తున్న వేళ.. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్, జనసేన నాయకుడు డాక్టర్ కందుల నాగరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా AP Todayతో మాట్లాడిన ఆయన, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని తెలిపారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ తనకు అవకాశం కల్పిస్తే.. మేయర్‌గా గెలిచి ప్రజలకు మరింత సేవ చేయడంతో పాటు జనసేన పార్టీకి మరింత ఉన్నత స్థాయిలో సేవలందించే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు కందుల నాగరాజు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు

తాను కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రజల్లో ఉండటం లేదని కందుల నాగరాజు పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా KNR Charitable Trust ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు.

పేద కుటుంబాల్లో జరిగే వివాహాల్లో నూతన వధువులకు బంగారు తాళిబొట్లు అందించడం, పుష్పవతి అయిన బాలికలకు పట్టుబట్టలు అందించడం, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అదేవిధంగా పేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు అంత్యక్రియలకు సహాయం చేయడం, దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించడం సహా పలు రకాల సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వివరించారు.

2000కు పైగా ఓట్లతో ప్రజలు గెలిపించారు

తన రాజకీయ ప్రస్థానంలో ప్రజల ఆదరణకు సంబంధించిన విషయాన్ని కూడా కందుల నాగరాజు ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి అనుకూల పరిస్థితులు ఉన్న సమయంలో కూడా తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించానని ఆయన పేర్కొన్నారు.

పార్టీల రాజకీయ ప్రభావాలకు అతీతంగా ప్రజలతో తనకు ఉన్న అనుబంధం, తాను చేసిన సేవా కార్యక్రమాలే తనకు ప్రజల మద్దతును తీసుకొచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజలకు మరింత చేరువగా సేవ చేయడమే లక్ష్యం

ప్రస్తుతం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని కందుల నాగరాజు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నానని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం తనకు అవకాశం కల్పిస్తే, ప్రజల మద్దతుతో విజయం సాధించి విశాఖ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సేవలకు మరింత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

వంశీకృష్ణతో కలిసి ప్రజా సేవకు ప్రాధాన్యత

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ప్రజలకు చేరువగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కందుల నాగరాజు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సాధ్యమైన మేరకు వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement