శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / మధురవాడలో డెడ్ బాడీ కలకలం.. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి’ అంటూ నోట్
మధురవాడలో డెడ్ బాడీ కలకలం.. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి’ అంటూ నోట్
AP TODAY
AP TODAY

October 8, 2026

విశాఖపట్నం మధురవాడలోని మొగధారమ్మ ఆలయం సమీపంలో ఓ అపార్ట్మెంట్‌లో మృతదేహం కలకలం రేపింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పీఎంపాలెం ఎస్‌ఐ సంతోష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్‌లో పరిశీలించగా ఓ మృతదేహాన్ని గుర్తించారు.

ఐదు రోజుల క్రితమే మృతి?

పోలీసుల ప్రాథమిక పరిశీలన ప్రకారం మృతుడు బీటెక్ విద్యార్థి గణేష్ వర్మగా గుర్తించారు. నివాసితుల ద్వారా మృతుడి వివరాలు తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతి చెంది సుమారు ఐదు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా భావించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం, పోలీసుల దర్యాప్తు అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

‘అమ్మానాన్న నన్ను క్షమించండి’ అంటూ నోట్

ఘటనా స్థలంలో ఓ నోట్ కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అందులో “అమ్మానాన్న నన్ను క్షమించండి” అని రాసి ఉన్నట్లు సమాచారం.

ఈ నోట్‌తో పాటు ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గణేష్ వర్మ మృతికి సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

గమనిక: ఎవరైనా తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్లయితే, ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులను సంప్రదించాలి. భారతదేశంలో Tele-MANAS: 14416 ద్వారా మానసిక ఆరోగ్య సహాయం పొందవచ్చు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement