శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. 67 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. 67 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల
AP TODAY
AP TODAY

October 6, 2026

హైదరాబాద్, అక్టోబర్ 6: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సుమారు 67 రోజుల పాటు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం ఉప్పర్‌పల్లి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌లో భాగంగా రూ.25 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తుదారులను సమర్పించాల్సిందిగా, అలాగే ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం.

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు జూలైలో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును అనంతరం హైదరాబాద్ పోలీసుల విమెన్ సేఫ్టీ వింగ్ చేపట్టింది. కేసులో పోలీసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

బెయిల్ మంజూరైనప్పటికీ కేసు ముగిసినట్లు కాదు. దర్యాప్తు, తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగనున్నాయి. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement