శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / తలకిందులుగా వేలాడదీసి, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినట్లు ఆరోపణలు.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు!
తలకిందులుగా వేలాడదీసి, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినట్లు ఆరోపణలు.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు!
AP TODAY
AP TODAY

October 12, 2026

ఉత్తరప్రదేశ్: బంగారు కడియం చోరీ జరిగిందనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను హింసించినట్లు ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ఎమ్మెల్యే సుశాంత్‌పై ఆరోపణలు వచ్చాయి. బాధితులను తలకిందులుగా వేలాడదీసి, బెల్టుతో కొట్టి, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినట్లు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బంగారు కడియం చోరీ అనుమానంతో హింస?

బంగారు కడియం చోరీకి సంబంధించిన విషయంపై ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులను తలకిందులుగా వేలాడదీసి బెల్టులతో కొట్టడంతో పాటు విద్యుత్ షాక్ ఇచ్చినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నరు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులకు బాధిత కుటుంబాల ఫిర్యాదు

బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. అయితే ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్పష్టమైన సమాచారం లేదని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆరోపణలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

ఎమ్మెల్యే ఏమన్నారు?

తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందిస్తూ, బంగారు కడియం విషయంపై కేవలం ఆరా మాత్రమే తీశానని తెలిపారు. బాధిత కుటుంబాలు చేసిన ఆరోపణలు, ఎమ్మెల్యే వివరణ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement