శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / భారీ వర్షాలకు సెయింట్ ఆంథోనీ పాఠశాల ప్రహరీ గోడ కూలింది
భారీ వర్షాలకు సెయింట్ ఆంథోనీ పాఠశాల ప్రహరీ గోడ కూలింది
AP TODAY
AP TODAY

September 24, 2026

రాళ్లు పడి ద్విచక్ర వాహనం ధ్వంసం.. పాత గోడను తొలగించి కొత్త ప్రహరీ నిర్మించాలని విజ్ఞప్తి

విశాఖపట్నం, సెప్టెంబర్ 24:
విశాఖపట్నంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో 29వ వార్డు ఆంథోనీ నగర్‌లోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్ వెనుక భాగంలో ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది.

భారీ వర్షాల కారణంగా గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాలు రోడ్డుపై పడిపోయాయి. ఈ ఘటనలో అక్కడ ఉన్న ఓ ద్విచక్ర వాహనం రాళ్ల కింద పడి పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఘటనపై మాజీ కార్పొరేటర్ స్పందన

ప్రహరీ గోడ కూలిన విషయం తెలుసుకున్న 29వ వార్డు మాజీ కార్పొరేటర్ ఉరికిటి నారాయణరావు వెంటనే స్పందించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత వర్గాలను కోరారు.

ఈ సందర్భంగా చర్చి యాజమాన్యంతో పాటు పోలీసు శాఖ అధికారులను ఘటనా స్థలానికి పిలిపించి పరిస్థితిపై చర్చించారు. కూలిన గోడ కారణంగా ప్రజలకు, వాహనదారులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున వెంటనే శిథిలాలను తొలగించాలని సూచించారు.

కొత్త ప్రహరీ గోడ నిర్మించాలని విజ్ఞప్తి

ఇప్పటికే శిథిలావస్థకు చేరిన పాత ప్రహరీ గోడను పూర్తిగా తొలగించి, అదే ప్రాంతంలో కొత్త ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని మాజీ కార్పొరేటర్ ఉరికిటి నారాయణరావు పాఠశాల యాజమాన్యాన్ని కోరారు.

వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదకర నిర్మాణాల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థులు, సిబ్బంది, స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement