శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు.. పూర్తయిన ఫుట్‌పాత్ ఆక్రమణ నిర్మాణం!
ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు.. పూర్తయిన ఫుట్‌పాత్ ఆక్రమణ నిర్మాణం!
AP TODAY
AP TODAY

October 17, 2026

విశాఖపట్నం: ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో, పాదచారుల మార్గంలో అక్రమ నిర్మాణం పూర్తయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో ఆక్రమణదారులకు అవకాశం లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురుద్వారా నుంచి పాత ఈనాడు కార్యాలయం వైపు వెళ్లే మార్గంలో, వెంకటేశ్వర క్లాసెస్ ఎదురుగా కొత్తగా నిర్మించిన కల్వర్టుపై శాశ్వత షాపు నిర్మాణం చేపడుతున్నారంటూ ఈ నెల 12న AP Todayలో వార్త ప్రచురితమైంది. పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై విచారణ జరపాలని స్థానికులు జీవీఎంసీ అధికారులను కోరిన విషయాన్ని అప్పట్లో వెలుగులోకి తీసుకొచ్చాం.

అయితే, ఫిర్యాదుపై సంబంధిత అధికారులు సకాలంలో స్పందించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈలోగా సదరు నిర్మాణం పూర్తయిందని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చర్యలు తీసుకుని ఉంటే నిర్మాణాన్ని అడ్డుకునే అవకాశం ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు.

నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా?

కల్వర్టుపై శాశ్వత షాపు నిర్మాణానికి సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా జరిగిందా? పాదచారుల మార్గానికి ఆటంకం కలుగుతోందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే అనుమతి ఇచ్చారని కొందరు చెబుతున్నట్లు గతంలో కాలనీవాసులు పేర్కొన్నప్పటికీ, ఈ విషయంపై అధికారిక నిర్ధారణ అందుబాటులో లేదు.

జీవీఎంసీ అధికారులు స్పందించాలి

ఫుట్‌పాత్‌లు, కల్వర్టులు ప్రజల రాకపోకలకు ఉపయోగపడాల్సినవి. వాటిపై నిర్మాణాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనే అంశాన్ని జీవీఎంసీ అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణానికి అనుమతుల వివరాలను వెల్లడించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు సకాలంలో స్పందించకపోతే సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఈ ఘటన చర్చకు తెస్తోంది. ఈ వ్యవహారంపై జీవీఎంసీ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడిస్తారా? నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement